M:ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హల అదెంత వేడివెన్నెలా ముఖా ముఖి ముడేసుకున్న ముద్దులా
F:గీత గోవిందుడు వీనులావిందుడు రాగమాల తోనే రాసలీలలాడగ
మజా మజా మజా ఘుమాఘుమాలయా నిజానికి ఇదంత ఒట్టు నీదయా
M:పూవులెన్నో విచ్చినట్టుగా చెలి నవ్వగానే నచ్చినావులే
F:చుక్కలెన్నో పుట్టినట్టుగ ప్రియ చూసుకోరా పట్టికౌగిలి
M:ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులురాసే
జగడమొకటి సాగిందోయమ్మో
F:అజంతాలా ప్రాసలువేసి వసంతాల ఆశలురేపి
లలితకవిత నీకే మాలగా
M:దోరసోకు తోరణాలా కౌగిలింత కారణాలై
వంశధార నీటిమీద హంసలేఖ రాసినా
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హల అదెంత వేడి వెన్నెలా
F:నిజానికి ఇదంత ఒట్టు నీదయా
F:సమ్ముఖాన రాయబారమా సరే సందె గాలి ఒప్పుకోదులే
M:చందమామ తోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే
F:పెదాలమ్మ కచ్చేరిలో పదాలెన్నో కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టిందోయమ్మా
M:సరగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటె
పరువమొకటి వచ్చే వాంఛలా
F:కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి
జుంటితేనే మత్తులోనా కొంటె వేణువూదినా
గీత గోవిందుడు వీనులావిందుడు రాగమాల తోనే రాసలీలలాడగ
మజా మజా మజా ఘుమాఘుమాలయా నిజానికి ఇదంత ఒట్టు నీ దయా
M:ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హల అదెంత వేడివెన్నెలా.. ముఖా ముఖి ముడేసుకున్న ముద్దులా
THANK YOU
మీ బాలకృష్ణ శ్రీకాకుళం