కర్మే రాయిగా కాలికి తగిలితే
రేగిన గాయమే మానునా
పగతో రగులుతూ పూజలు జరిపితే
గుడిలో దైవమే ఉండునా
చీకటిని తరిమేందుకు
వెలిగే చిన్న దీపం
ఊరూరంతా తగలబెట్టె జ్వాలయింది ఏంటో
హే హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ
ఆరె ఆరో నే రానీనో రే నో
ఓర్చుకునే బాధ కాదీ తలరాత
బ్రతుకంతా వెంటపడుతూ తరిమేనటా
మార్చుకునే వీలు లేదే విధి రాత
నీలోని నిను వెతుకుతు కదలాలటా
విడిచి పెట్టుతున్న
మన పాపం గంగల్లోన
వదిలి పెట్టదంటా పశ్చాత్తాపం
కల్లోనైనా అహముతో ఎగిరావంటే
మెళ్ళో పూలమాలే
రాలి రాలి దండ విడిచి
ఆ పువ్వులే హే హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ
ఆరె ఆరో నే రానీనో రే నో