menu-iconlogo
huatong
huatong
Letras
Grabaciones
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ సో సెక్సీ

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ గివ్ టచ్ మీ

కళ్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే

మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే

నా ప్రేమగాథ నువ్వే

ఓ చెలియ చెలియా ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమజోల నువ్వే

ఓ సఖియ సఖియా మదిలోన జ్వాల నువ్వే

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ సో సెక్సీ

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ గివ్ టచ్ మీ

పువ్వై పువ్వై పరిమళించినావే ముళ్లై ముళ్లై మనసు కోసినావే

మెరుపై మెరుపై వెలుగు పంచినావే పిడుగై పిడుగై కలలు కూల్చినావే

ప్రేమకు అర్థం అంటే కన్నీట్లో పడవేనా

ప్రేమకు గమ్యం అంటే సుడిగుండంలోకేనా

చరితల్లోనే ఉందమ్మా చేరద్దంటూ ఈ ప్రేమ

వినక మతిపోయి ప్రేమించానమ్మా

కనుక మూల్యాన్ని చెల్లించానమ్మా

నా ప్రేమగాథ నువ్వే

ఓ చెలియ చెలియా ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమజ్వాల నువ్వే

ఓ సఖియ సఖియా మదిలోన జ్వాల నువ్వే

నువ్వే నువ్వే ఆదరించినావే ఆపై ఆపై చీదరించినావే

నిన్నే నిన్నే ఆశ్రయించగానే నాలో నాలో ఆశ తుంచినావే

కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే

దేవత మెళ్లో హారం ఉరి తాడై బిగిసిందే

ప్రేమపైనే నమ్మకం కోల్పోయానే ఈ క్షణం

ప్రేమ పనిలేని చోటుకి వెళ్లాలి నువ్వు కనలేని గూటికి చేరాలి

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ సో సెక్సీ

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు ఆర్ గివ్ టచ్ మీ

Más De Harry Harlan/Jenny/Mathangi Jagdish

Ver todologo

Te Podría Gustar