అభినవ శశిరేఖవో.....
ప్రియతమ శుభలేఖవో .....
అభినవ శశిరేఖవో.......
ప్రియతమ శుభలేఖవో ....
ఆ తొలి చూ..పు కిరణాల నెలవంక నీవో..
నవయువ కవిరాజువో...
ప్రియతమ నెలరాజువో...
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో..
నవయువ కవిరాజువో....
ప్రియతమ నెలరాజువో....
ఆ కనులు ఇంద్ర నీలాలుగా...
ఈ తనువు చంద్ర శిఖరాలు గా...
కదలాడు కల్యాణివే...
నా హృదయం మధుర సంగీతమై...
కల్యాణ వీణ స్వరగీతమై..
శ్రుతి చేయు జతగాడివే...
ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే.......
నవయువ కవిరాజువో....o..o..o.o
అభినవ శశిరేఖవో....o..o..o..
నా వయసు వలపు హరివిల్లుగా...
నవపారిజాతాల పొదరిల్లు గా...
రావోయి రవిశేఖరా.......
తొలి సంధ్య మధుర మందారమే....
నీ నుదిటి తిలక సింగా..రమై...
నూరేళ్ళు వెలిగించనా.....
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా.....
అభినవ శశిరేఖవో....(f:ఆ..ఆ..ఆ..)
ప్రియతమ శుభలేఖవో...
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో...
నవయువ కవిరాజువో....(m:ఆ..ఆ..ఆ..)
ప్రియతమ నెలరాజువో...
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో...
అభినవ శశిరేఖవో....(f:ఆ..ఆ..ఆ..)
ప్రియతమ నెలరాజువో...(m:ఆ..ఆ..ఆ..)