ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు
ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం
ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ!
ఉఉఉ ఊ ఉఉఉ ఊ ఏదో ఏదో అన్నదీ
.. ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు!
ఉఉఉ ఊ ఉఉఉ ఊ ఏదో ఏదో అన్నదీ
.. ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు
అ అ అ అ అఅఅ ఉహు ఉహు ఊ ఉహుహు