menu-iconlogo
huatong
huatong
google-manasuna-cover-image

Manasuna

googlehuatong
Diunggah oleh 62037235728
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం

చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే

సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ

మునిగే మనసు అసలు బెదరలేదులే

ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు

నను విడి వెళ్ళిపోవుట నేను చూసానే

తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి

కలలో కలలో నను నేనే చూసానే

నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు

ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు

నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు

ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు

దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి

మనసును అర్పించగ ఆశ పడ్డానే

వలదని ఆపునది ఏదని అడిగే మది

నదిలో ఆకు వలె కొట్టుకు పోయానే

గరికలు విరులయ్యే మార్పే అందం

ఎన్నో యుగములుగా మెలిగిన బంధం

ఒక వెండి గొలుసు వోలె యీ మనసు ఊగెనిపుడు

తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు

ఒక వెండి గొలుసు వోలె యీ మనసు ఊగెనిపుడు

తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు

Kamu Mungkin Menyukai

Lihat selengkapnyalogo

Daftar Putar Terkait

Lihat selengkapnyalogo