menu-iconlogo
huatong
huatong
가사
기록
అమ్మా వినమ్మా నేనాటి నీ లాలి పదాన్నే

ఓ ఔనమ్మా నేనేనమ్మా

నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే

మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా

గానమై ఈనాడే మేలుకున్నా

నీ పాదాలకు మువ్వల్లా

నా అడుగులు సాగాలమ్మా

నీ పెదవుల చిరునవ్వుల్లా

నా ఊపిరి వెలగాలమ్మా

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి

నే నెన్నాళ్లకీ

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా

అణువణువు నీ కొలువే అమ్మా

ఎదసడిలో శ్రుతిలయలు నువ్వే అమ్మా

నే కొలిచే శారదవే

నను నిత్యం నడిపే సారధివే

బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి

నిదర రావాలంటే కథలు వినిపించాలి

ఆకలయ్యిందంటే నువ్వె తినిపించాలి

ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా

నువ్వుంటేనే నేనూ

నువ్వంటే నేనూ

అనుకోలేకపోతే ఏమైపోతాను

నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా

తడబడి పడిపోనా చెప్పమ్మా

మరి మరి నునునువు మురిపెముగా

చూస్తూ ఉంటే చాలమ్మా

పరిపరి విధముల గెలుపులుగా

పైకెదుగుతు ఉంటానమ్మా

అయినా సరే ఏనాటికీ ఉంటాను

నీ పాపాయినై

నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే

ని స గ రి మ గ గ గ రి మ గ గ గ రి మ గ రి స రి

ని స గ రి మ ప ప ప ప ప ప గ మ ని ద ప మ గ

గ మ గ ని ద గ రి స ని గ రి స ని స ని ద ప స మ గ

గ మ ని ద ప మ గ మ ద ప రి స

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి

నే నెన్నాళ్లకీ

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి

నే నెన్నాళ్లకీ

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి

నే నెన్నాళ్లకీ

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా

అణువణువు నీ కొలువే అమ్మా

ఎదసడిలో శ్రుతిలయలు నువ్వే అమ్మా

నే కొలిచే శారదవే

నను నిత్యం నడిపే సారధివే

అమ్మ

Jakes Bejoy/Sid Sriram의 다른 작품

모두 보기logo

추천 내용