menu-iconlogo
huatong
huatong
avatar

Undipo - From "Ismart Shankar"

Ramya Behara/Anurag Kulkarnihuatong
가사
기록
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా

ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా

ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా

ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా

నీతోనే నిండిపోయే నా జీవితం

వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం...

మనసే మొయ్యలేనంతలా

పట్టి కొలవలేనంతలా

విప్పి చెప్పలేనంతలా

హాయే కమ్ముకుంటోందిగా

ఏంటో చంటిపిల్లాడిలా

నేనే తప్పిపోయానుగా

నన్నే వెతుకుతూ ఉండగా

నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా

ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా

సరికొత్త తడబాటే

మారింది అలవాటులాగా

ఇది చెడ్డ అలవాటే

వదిలేసి ఒక మాటు రావా

మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో

బిడియాలు పారిపోవా ఎటువైపుకో

ఆహా' సన్నగా సన్నగా

సన్న జాజిలా నవ్వగా

ప్రాణం లేచి వచ్చిందిగా

మళ్ళీ పుట్టినట్టుందిగా

ఓహో' మెల్లగా మెల్లగా

కాటుక్కళ్ళనే తిప్పగా

నేనో రంగులరాట్నామై

చుట్టూ తిరుగుతున్నానుగా

తల నిమిరే చనువౌతా

నువు గాని పొలమారుతుంటే

ఆ మాటే నిజమైతే

ప్రతిసారి పొలమారిపోతా

అడగాలిగాని నువ్వు అలవోకగా

నా ప్రాణమైన ఇస్తా అడగచ్చుగా

ప్రాణం నీదని నాదని

రెండు వేరుగా లేవుగా

ఎపుడో కలుపుకున్నాం కదా

విడిగా ఉండలేనంతగా

ఉందాం అడుగులో అడుగులా

విందాం ప్రేమలో గల గల

బంధం బిగిసిపోయిందిగా

అంతం కాదులే మన కథ

Ramya Behara/Anurag Kulkarni의 다른 작품

모두 보기logo

추천 내용