1:పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఎం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
2:పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు
1:ఓ.. నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు
అర్దమే లేదు
మచ్చేదో ఉన్నాదని మబ్బుల్లో
జాబిల్లి దాగుండిపోదు
2:పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
...............................
Anu
...............................
1:ఉంగరాల జుట్టే లేదా
నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా
మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని
తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా
మెరిసేటి సొగసులని
2:అందంగా లేను అని
నిన్నెవరూ చూడరని
నువ్వెవరికీ నచ్చవని
నీకెవ్వరు చెప్పారు
1:ఎంత మంచి మనసో నీది
దాని కన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరు
ఇంత నచ్చలేదు
2:నల్లగా ఉన్నానని కోకిల
కొమ్మల్లో దాగుండిపోదు
1: పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
..........................
Anu
.......................
2:అంతలేసి కళ్ళుండకున్నా
నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని
మరీ పర్లేదు
పరదాలే ఎన్నాళ్ళిలా అని
నిన్నే అడగమని
సరదాగా తరిమింది మది నీపై
మనసుపడి
1:మురిపించే ఊహలతో
ముఖచిత్రం గీసుకొని
అది నువ్వో కాదో అని
సందేహం ప్రతీసారి
2:చేరదీసి లాలించలేదు
నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు
ఇంత నచ్చలేదు
1:ఎవరేమన్నా సరే నా చెయ్యి
నిన్నింక వదిలేదు లేదు
2:పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
1:పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు...