menu-iconlogo
huatong
huatong
avatar

Padutha Theeyaga Mooga Manasulu

Anrhuatong
ammahuzurhuatong
Letra
Gravações
పాడుతా తీయగా సల్లగా

పాడుతా తీయగా సల్లగా

పసిపాపలా నిదరపో తల్లిగా,

బంగారు తల్లిగా

పాడుతా తీయగా సల్లగా

కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది

కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది

కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది

కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది

కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకూ

కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకూ

ఆ కలిమి కూడ దోచుకునే

దొరలు ఎందుకు

పాడుతా తీయగా సల్లగా

గుండె మంట లారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు

ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు

గుండె మంట లారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు

ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

ఉన్నోళ్ళు పొయినోళ్ళ

తీపిగురుతులు

పాడుతా తీయగా సల్లగా

మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటదీ

మనసుతోటి మనసెపుడో కలసిపోతదీ

మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటదీ

మనసుతోటి మనసెపుడో కలసిపోతదీ

సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ

సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ

జనమ జనమకది మరీ గట్టిపడతదీ

పాడుతా తీయగా సల్లగా

పసిపాపలా నిదరపో తల్లిగా

బంగారు తల్లిగా

పాడుతా తీయగా సల్లగా

Mais de Anr

Ver todaslogo