చిత్రం : సుబ్రమణ్యం ఫర్ సేల్ 2015
తారాగణం : సాయిధరమ్ తేజ్ , రెజీనా
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింక నై
అర్రే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండూ నాగుండెలో మ్రోగిందిలే
వీణ పాటా హా.. ఆ
సంగీతం : మిక్కీ జే.మేయర్
రచన : భువనచంద్ర
జోడుకోసం గోడ దూకే వయసిది
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం తగదులే
తమరికి అబ్బాయి గారూ
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా
అర్రే.. గువ్వా
హా
గోరింకతో
హా
ఆడిందిలే బొమ్మలాట
హేయ్ నిండూ
అహ
నాగుండెలో
అహ
మ్రోగిందిలే వీణ పాట హా... హోయ్...హొయ్
గానం : మనో , రమ్య బెహర
కొండనాగు తోడుచేరే నాగిని
బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో
ఉందిలే ఎంతో సంతోషం
పూవ్వులో మకరందము ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ
హే..గువ్వా
హోయ్
గోరింకతో
హోయ్
ఆడిందిలే బొమ్మలాట
అహ్హ...నిండూ
హా
నాగుండెలో
ఆ..హా
మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై