ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడిరేయిలో నీవు. నిదురైన రానీవు.
గడిపేదెలా కాలమూ . గడిపేదెలా కాలమూ .
పగలైన కాసేపు ... పని చేసుకోనీవు...
నీ మీదనే ధ్యానము . నీ మీదనే ధ్యానము .
ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది...
నువు కాక వేరేదీ . కనిపించనంటోంది...
ఈ ఇంద్రజాలాన్ని . నీవేనా చేసింది...
నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.
నీ మాట వింటూనే . ఏం తోచనీకుంది.
నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.
మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను...