menu-iconlogo
huatong
huatong
歌词
作品
కానున్న కళ్యాణం ఏమన్నది?

స్వయంవరం మనోహరం

రానున్న వైభోగం ఎటువంటిది?

ప్రతి క్షణం మరో వరం

విడువని ముడి ఇదేకదా?

ముగింపులేని గాథగా

తరములపాటుగా

తరగని పాటగా

ప్రతిజత సాక్షిగా

ప్రణయమునేలగా సదా

(కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా)

(ధీరేననాన ధీరేనన

ధీరెననాన నా

దేరెన దేరెన

దేరెన దేనా)

చుట్టూ ఎవరూ ఉండరుగా?

కిట్టని చూపులుగా

చుట్టాలంటూ కొందరుండాలిగా?

దిక్కులు ఉన్నవిగా

గట్టిమేళమంటూ వుండదా?

గుండెలోని సందడి చాలదా?

పెళ్ళిపెద్దలెవరు మనకి?

మనసులే కదా

అవా? సరే!

(కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా)

(తానె ధీరే ధీమ్తా ధీరేనా ఉదని తనని ధిరేనేనా

తానె ధీరే ధీమ్తా ధీరేనా ఉదని తనని ధిరేనేనా

ధీరే ధిరేనేనా తననినా

ధీరే ధిరేనేనా తననినా

తాన ధీరే తదని ధిరన ధీమ్తా తనని ధిరేనేనా)

తగు తరుణం ఇది కదా?

మదికి తెలుసుగా

తదుపరి మరి ఏమిటట?

తమరి చొరవట

బిడియమిదేంటి కొత్తగా?

తరుణికి తెగువ తగదుగా

పలకని పెదవి వెనక

పిలుపు పోల్చుకో

సరే మరి

(కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా

కళ్ళముందు పారాడగా)

更多Vishal Chandrashekhar/Anurag Kulkarni/Sinduri Vishal热歌

查看全部logo

猜你喜欢