menu-iconlogo
huatong
huatong
歌詞
作品
నాలోనే పొంగెను నర్మద

నీళ్ళల్లో మురిసిన తామర

అంతట్లో మారెను ఋతువులా

పిల్లా నీవల్ల

నీతో పొంగే వెల్లువ

నీళ్ళల్లో ఈదిన తారక

బంగారు పువ్వుల కానుక

పేరేలే కాంచన

ఓ శాంతి శాంతి ఓ శాంతి

నా ప్రాణం సర్వం నీవేలే

నా శ్వాసే నీవే దోచావే

చెలి నేనే నీవు అయ్యావే

నాలోనే పొంగెను నర్మద

నీళ్ళల్లో మురిసిన తామర

అంతట్లో మారెను ఋతువులా

పిల్లా నీవల్ల

ఏదో ఒకటి నన్ను కలచి

ముక్కు చివర మర్మమొకటి

కల్లాకపటం కరిగిపోయే

ముసినవ్వా బూగమెల్లా

నువు నిలిచిన చోటేదో

వెల ఎంత పలికేనో

నువు నడిచే బాటంతా

మంచల్లే అయ్యేనో

నాతోటి రా ఇంటి వరకు

నా ఇల్లే చూసి నన్ను మెచ్చు

ఈమె ఎవరో ఎవరో తెలియకనే

ఆ వెనకే నీడై పోవొద్దే

ఇది కలయో నిజమో ఏమ్మాయో

నా మనసే నీకు వశమాయే (వశమాయే)

నాలోనే పొంగెను నర్మద

నీళ్ళల్లో మురిసిన తామర

అంతట్లో మారెను ఋతువులా

పిల్లా నీవల్ల

నీతో పొంగే వెల్లువ

నీళ్ళల్లో ఈదిన తారక

బంగారు పువ్వుల కానుక

పేరేలే కాంచన

కంటి నిద్రే దోచుకెళ్ళావ్ (దోచుకెళ్ళావ్)

ఆశలన్నీ చల్లి వెళ్ళావ్

నిన్ను దాటి పోతువుంటే (పోతువుంటే)

వీచే గాలి దిశలు మారు

ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే

నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు

కౌగిలింతే కోరలేదు, కోరితే కౌగిలి కాదు

నా జీవన సర్వం నీతోనే

నను తలచే నిమిషం ఇదియేనే

నువు లేవు లేవు అనకుంటే

నా హృదయం తట్టుకోలేదే

(నాలోనే పొంగెను నర్మద)

(నీళ్ళల్లో మురిసిన తామర)

(అంతట్లో మారెను ఋతువులా)

(పిల్లా నీవల్ల)

నీతో పొంగే వెల్లువ

నీళ్ళల్లో ఈదిన తారక

బంగారు పూవుల కానుక

పేరేలే కాంచన

ఓ శాంతి శాంతి ఓ శాంతి

నా ప్రాణం సర్వం నీవేలే

నా శ్వాసే నీవే దోచావే

చెలి నేనే నీవు అయ్యావే

更多Harris Jayaraj/VV Prassanna/Harish Raghavendra/Devan Ekambaram熱歌

查看全部logo