menu-iconlogo
huatong
huatong
sid-sriramsunitha-neeli-neeli-aakasam-cover-image

Neeli Neeli Aakasam

Sid Sriram/Sunithahuatong
mrarnkbhuatong
歌詞
作品
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

నెలవంకను ఇద్దామనుకున్నా

ఒహోహో నీ నవ్వుకు సరిపోదంటున్నా..

నువ్వే నడిచేటి తీరుకే

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

ఓహో వానవిల్లులో

ఉండని రంగు నువ్వులే

ఏ రంగుల చీరను నీకు నేయాలే

నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే

ఆ కళ్ళకు కాటుకా ఎందుకేట్టాలే

చెక్కిలిపై చుక్కగా

దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా ఆ చుక్కను పెట్టలే

ఎదో ఇవ్వాలి కానుకా

ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదికా

అంటూ ఓడాను పూర్తిగా

కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

నీ హృదయం ముందర

ఆకాశం చిన్నది అంటున్నా

ఓహో అమ్మ చూపులో

వొలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వలే .

నన్ను వేలితో నడిపే ధైర్యమే నీదే

నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వలే

దయగలిగిన దేవుడే

మనలను కలిపాడులే

వరమోసిగే దేవుడికే నేనేమి తిరిగివ్వాలె

ఎదో ఇవ్వాలి కానుక

ఎంతో వెతికాను ఆశగా

ఏది నీ సాటి రాదికా

అంటూ అలిసాను పూర్తిగా

కనుకే మళ్ళీ మళ్ళీ

జన్మనేత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్ను కమ్మేస్తాయని

మానేస్తూ ఉన్నా

更多Sid Sriram/Sunitha熱歌

查看全部logo