ఓం
ఓం నమశివాయా ..ఆ..ఆ..
నవనీత హృదయా .....
సమప్రకాశా..ఆ..ఆ....
తరుణేందుభూషా..ఆ..ఆ..ఆ...
నమో శంకరా.....
దేవ దేవ .......
మహేశా పాపవినాశా కైలాశ వాసా ఈశా
నిన్ను నమ్మినానురావా నీలకంధరా
దేవా...మహేశా పాపవినాశా కైలాశ వాసా ఈశా
నిన్ను నమ్మినానురావా నీలకంధరా
భక్తి ఏదొ పూజాలేవో తెలియనైతినే....
భక్తి ఏదొ పూజాలేవో తెలియనైతినే....
పాపమేదొ పుణ్యమేదో కాననైతినే
దేవా...పాపమేదొ పుణ్యమేదో కాననైతినే
దేవా...మహేశా పాపవినాశా కైలాశ వాసా ఈశా
నిన్ను నమ్మినానురావా నీలకంధరా
మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా...ఆ..ఆ..
మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగనైతినే ..ఏ ..ఏ
మంత్రమో తంత్రమో యెరుగనైతినే ..ఏ ..ఏ
నాదమేదో వేదమేదో తెలియనైతినే.....
నాదమేదో వేదమేదో తెలియనైతినే.....
వాదమేల పేద బాధ తీర్పరావయ స్వామీ
వాదమేల పేద బాధ తీర్పరావయ
స్వామీ..మహేశా పాపవినాశా కైలాశ వాసా ఈశా
నిన్ను నమ్మినానురావా నీలకంధరా
ఏకచిత్తమున నమ్మినవారికి
శోకముతీర్తువ రుద్రయ్య
ఏకచిత్తమున నమ్మినవారికి
శోకముతీర్తువ రుద్రయ్య
ప్రాకతముగ చిరువేటజూపి
నాఆకలి తీర్పగరావయ్యా
ప్రాకతముగ చిరు వేటజూపి
నా ఆకలి తీర్పగ రావయ్యా
నీతిగ నమ్మితి గనవయ్యా వేటచూపుమా రుద్రయ్య
నీతిగ నమ్మితి గనవయ్యా వేటచూపుమా రుద్రయ్య
వేటచూపుమా రుద్రయ్య
వేటచూపుమా రుద్రయ్య
వేటచూపుమా రుద్రయ్య
వేటచూపుమా రుద్రయ్య