menu-iconlogo
logo

Ve vela Gopemmala

logo
Lời Bài Hát
వే వేలా గోపెమ్మలా మువ్వ

గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల

వేణువులూదాడె మది వెన్నలు దోచాడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ

గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే

నిన్ను కన్న వన్నెకాడే

మన్ను తిన్న చిన్నవాడే

నిన్ను కన్న వన్నెకాడే

కన్న తోడు లేనివాడే కన్నె తోడు వున్నవాడే

మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె

మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె

చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే

పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే మా

మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ

గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే

రాసలీలలాడినాడే రాయబారమేగినాడే

గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే

గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే

నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే

వరదయ్య గానాల వరదలై పొంగాడే మా

మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ

గోపాలుడే మా ముద్దు గోవిందుడే

అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల

వేణువులూదాడె మది వెన్నలు దోచాడే

అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల

వేణువులూదాడె మది వెన్నలు దోచాడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ

గోపాలుడే

మా ముద్దు గోవిందుడే

Ve vela Gopemmala của Spb/Sp Sailaja - Lời bài hát & Các bản Cover