(YaswaTrack)
ID: 62070718306
చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) film: jagadekaveerudu athiloka sundari
సంగీతం: ఇళయరాజాmusic: ilayaraja
గీతరచయిత: వేటూరి Lyrics: veturi
నేపధ్య గానం: బాలు, జానకి Singers: balu, janaki
F. లా లా ల ల ల లా lalala lalala lalala
M. లా లా ల ల ల లా lalala lalala lalala
F. లా లా ల ల ల లా lalala lalala lalala
M. హు హు హు హు హు hu..hum..hum..hu.hu
F. అందాలలో అహో మహోదయం andalalo aho mahodayam
భూలోకమే నవోదయం bhoolokame navodayam
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో puvvu navvu pulakinche galilo
నింగీ నేలా చుంబించే లాలిలో ninginela chumbinche lalilo
తారల్లారా రారే విహారమే tharallara raare viharame
M. అందాలలో అహో మహోదయం andalalo aho mahodayam
నా చూపుకే శుభోదయం naa choopuke shubhodayam
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
F. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో latha latha saragamade Suhasini sumalatho
M. వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో vayasutho vasanthamade varinchele saralalo
F. మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా mila mila himale jala jala muthyaluga
M. తళా తళా గళాన తటిల్లతా హారాలుగా thala thala galana thatillatha haaraluga
F. చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే chethulu thaakina kondalake chalamu vachenule
M. ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే munduku sagina muchatalo muvvalu palikenule
F. ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో oka swargam thalavanchi ila chere kshanalalo
M. అందాలలో అహో మహోదయం.. andalalo aho mahodayam
నా చూపుకే శుభోదయం naa choopuke shubhodayam
F. పువ్వూ నవ్వూ పులకించే గాలిలోpuvvu navvu pulakinche galilo
నింగీ నేలా చుంబించే లాలిలో ningi nela chumbinche lalilo
తారల్లారా రారే విహారమే tharallara rare viharame
M. అందాలలో అహో మహోదయం.. andalalo aho mahodayam
భూలోకమే నవోదయం bhoolokame navodayam
Created by
"Yaswantha"
F. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా sarassulo sarathu kosam thapassule phalinchega
M. సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా suvarnika sugandhamedo manasune harinchaga
F. మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా maralinai ilage mari mari natinchan
M. విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా viharinai ivale divi bhuvi sprusinchana
F. గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే grahamulu paadina pallavke jaabili oogenule
M. కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే kommalu thaakina aamanike koyila puttenule
F. ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో oka soukyam thanuvantha chelarege kshanalalo
అందాలలో అహో మహోదయం andalalo aho mahodayam
భూలోకమే నవోదయం bhoolokame navodayam
M. నీలాకాశం దిగివచ్చే లోయలోneelakasam digivache loyalo
ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో oohalokam yeduroche haayilo
నాలో సాగే ఏదో సరాగమే nalo saage yedo saragame
F. అందాలలో అహో మహోదయం andalalo aho mahodayam
భూలోకమే నవోదయం bhoolokame navodayam
"Yaswantha"
Thank You